Raghu Rama Krishna Raju: ఏపీ సీఎం జగన్ నుంచి నాకు ప్రాణ హాని

Raghu Rama Krishna Raju: 4 పేజీల్లో లేఖ రాసిన రఘురామరాజు

Rama Rao
Published on: 8 July 2022 8:54 AM IST
MP Raghu Rama Krishna Raju Latter to Parliament Members
X

Raghu Rama Krishna Raju: ఏపీ సీఎం జగన్ నుంచి నాకు ప్రాణ హాని

Raghu Rama Krishna Raju: AP CM జ‌గ‌న్ నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని MP ర‌ఘురామ‌కృష్ణరాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న స‌హ‌చ‌ర పార్లమెంటు స‌భ్యుల‌కు లేఖ రాశారు. 4 పేజీల‌ లేఖ‌లో వైసీపీ నేత‌ల‌పైనా, ప్రత్యేకించి సీఎం జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు గుప్పించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పైనే న‌ర‌సాపురం లోక్‌స‌భ స్థానం నుంచి ర‌ఘురామ‌రాజు ఎంపీగా గెలిచారు.

జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాల‌ను విమ‌ర్శించిన నేప‌థ్యంలో పార్టీతో ఆయ‌న‌కు దూరం పెరిగింది. ఈ క్రమంలో ఓ ద‌ఫా AP CID అధికారులు త‌న‌ను అరెస్ట్ చేశారు. క‌స్టడీలోనే పోలీసులు త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్రయోగించార‌ని ర‌ఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారంపైనా ఆయ‌న స‌హ‌చ‌ర ఎంపీల‌కు లేఖ‌లు రాశారు. తాజాగా జ‌గ‌న్ నుంచి త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ మ‌రోమారు ఎంపీల‌కు ర‌ఘురామ‌రాజు లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Rama Rao

Rama Rao

Next Story