Vande Bharat Express: ఏలూరు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎంపీ పుట్టా మహేష్

ఎట్టకేలకు ఎంపీ కృషితో ఆగస్టు 25 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో ఆగనుంది. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో ఒక నిమిషం పాటు ఆగనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2024 12:06 PM IST
MP Putta Mahesh gives good news to Eluru people
X

Vande Bharat Express: ఏలూరు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎంపీ పుట్టా మహేష్

Putta Mahesh Kumar Yadav: ఏలూరు ప్రజలకు ఎంపీ పుట్టా మహేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నో రోజులుగా ఏలూరు రైల్వేస్టేషన్‌లో వందే భారత్ రైలును ఆపాలన్న డిమాండ్ ఉంది. ఎట్టకేలకు ఎంపీ కృషితో ఆగస్టు 25 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో ఆగనుంది. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో ఒక నిమిషం పాటు ఆగనుంది.

ఆగస్టు 25న మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు బయలు దేరి ఏలూరికి 5 గంటల 54 నిమిషాలకు చేరుకోనుంది. ఏలూరు రైల్వేస్టేషన్ నుంచి 5 గంటల 55 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు నుంచి సికింద్రాబాద్ నుంచి వెళ్లే రైలు... విశాఖపట్నం నుంచి వచ్చే రైలు ఏలూరులో ఆగుతాయని ఎంపీ పుట్టా మహేశ్ తెలిపారు. వందే భారత్ రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఏలూరులో స్టాప్ ఇచ్చినందుకు ఎంపీ పుట్టా మహేశ్ ధన్యవాదాలు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story