Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. త్రిమూర్తులుపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హోంమంత్రికి ఫిర్యాదు
వైసీపీలో భగ్గుమన్న విభేదాలు.. త్రిమూర్తులుపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ హోంమంత్రికి ఫిర్యాదు

X
Highlights
తూర్పుగోదావరి జిల్లా మండపేట వైసీపీ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులుపై హోంమంత్రికి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్...
Arun Chilukuri16 Nov 2020 2:32 AM GMT
తూర్పుగోదావరి జిల్లా మండపేట వైసీపీ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులుపై హోంమంత్రికి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఫిర్యాదు చేశారు. దీంతో రామచంద్రాపురం వైసీపీలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలని హోంమంత్రికి పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖ రాశారు. శిరోముండనం కేసులో ఏ1గా తోట త్రిమూర్తులు ఉన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. త్రిమూర్తులు పలుకుబడితో తెలివిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Web Titlemp Pilli Subhash Chandra bose wrote a letter to home minister mekathoti sucharitha against Thota trimurthulu
Next Story