Visakhapatnam: విశాఖ స్థల వివాదంపై స్పందించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

Visakhapatnam: ఎంవీవీ బిల్డర్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు

Rama Rao
Published on: 29 March 2022 1:52 PM IST
MP MVV Satyanarayana Responds to the Visakhapatnam Land Dispute
X

విశాఖ స్థల వివాదంపై స్పందించిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

Visakhapatnam: విశాఖ స్థల వివాదంపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. ఇంటలిజెన్స్ ఎస్పీ మధుకు చెందిన స్థలాన్ని తాను కబ్జా చేయలేదని విశాఖ ఎంపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తాను ఎవరి భూమిని కబ్జా చేయలేదని చెప్పారు. ఎస్పీ మధుతో పాటు మరో నలుగురు కలిసి 500 గజాల స్థలాన్ని ఎల్లపు ఈశ్వర్ వద్ద కొనుగోలు చేశారన్నారు. అయితే ఈ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ఎస్పీ ప్రయత్నిస్తున్న విషయాన్ని తనకు కొందరు సమాచారం ఇచ్చారన్నారు.

అయితే ఈ విషయమై తాను పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనన్నారు. స్వంత స్థలంలోనైనా ఏదైనా అనుమతులు వచ్చిన తర్వాతే నిర్మాణాలు చేయాలన్నారు. కానీ ఎస్పీకి చెందిన భూమిలో కూడా అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని ఎంపీ వివరించారు. ప్రభుత్వ నిబంధనలు తాము కానీ, తమ సంస్థ కానీ ఉల్లంఘించలేదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story