Mithun Reddy: చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇదంతా- మిథున్‌రెడ్డి

Mithun Reddy: రఘురామ కృష్ణంరాజు వెనుక చంద్రబాబు ఉన్నట్లు రుజువు అవుతుంది అని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 17 May 2021 1:12 PM IST
MP Mithun Reddy Slams Chandrababu and Raghu Rama Krishnam Raju
X

Mithun Reddy: చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇదంతా- మిథున్‌రెడ్డి

Mithun Reddy: రఘురామ కృష్ణంరాజు వెనుక చంద్రబాబు ఉన్నట్లు రుజువు అవుతుంది అని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్‌లోనే రఘురామ పని చేస్తున్నారని, బెయిల్‌ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఇన్ని రోజులూ రఘురామ నడిచారు. బెయిలు రాకపోవడంతో ఇస్యుని డైవర్ట్ చెయ్యడానికి రకరకాల కథలు అల్లుతున్నారు. పోలీసులు కొట్టలేదని మెడికల్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. పోలీసులు నిజంగా కొడితే ఎవరైనా నడవగలుగుతారా..?

రమేష్ హాస్పిటల్ లో మాత్రమే ట్రీట్మెంట్ కావాలని అడగడం వెనుక అర్ధం ఏంటి..? రాజకీయ కుట్రలు చెయ్యడానికి చంద్రబాబు రఘురామ ని పావుగా వాడుకున్నాడు. ఈ కుట్రలో వీళ్ళ ప్రమేయం బయటపడుతుందని కేంద్ర పెద్దలకు లేఖలు రాస్తున్నారు. చంద్రబాబు చెత్త రాజకీయ ట్రాప్ లో ప్రజలు పడొద్దు. చంద్రబాబుకి ఇలాంటి కుట్ర రాజకీయాలు అలవాటే. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరగాలి. కుట్రలో భాగస్వామ్యం ఉన్నవారందరిపై చర్యలు తీసుకోవాలి అని మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story