Kesineni Nani: టైమ్, ప్లేస్, డేట్ చెప్పండి..కొట్టేసుకుందాం..

Kesineni Nani: ఏపీలో డ్రగ్స్‌కు రాచబాట వేశారని ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Updated on: 22 Oct 2021 8:30 PM IST
MP Kesineni Nani Challenged CM Jagan to fix Date and Time for a Direct Fight
X

Kesineni Nani: టైమ్, ప్లేస్, డేట్ చెప్పండి..కొట్టేసుకుందాం..

Kesineni Nani: ఏపీలో డ్రగ్స్‌కు రాచబాట వేశారని ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. విద్యార్థులు, పిల్లలు ఎక్కడ డ్రగ్స్‌ బారిన పడుతారోననే భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అరాచకాలను సహించమని హెచ్చరించారు. ఒకేసారి కొట్టేసుకుందాం రండీ అంటూ వైసీపీ నేతలను పిలిచారు ఎంపీ కేశినేని నాని. ఎక్కడికి పిలిచినా వస్తామని.. డేట్‌, ప్లేస్‌ మీరే చెప్పండి అంటూ వైసీపీకి ఛాన్స్‌ ఇచ్చారు ఆయన. రోజు విమర్శలతో ఏపీకి చెడ్డపేరు తేవొద్దన్నారు కేశినేని నాని. జగన్‌ను సంతోషపెట్టడానికి గుండాగిరికి పాల్పడుతున్నారంటూ దుయ్యబట్టారు. దొంగ కేసులను పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు కేశినేని నాని.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story