వైసీపీ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్ ఫైర్

GVL Narasimha Rao: జీపీఎఫ్ నుంచి రూ.800 కోట్లు లాగేయటం దారుణం

Jyothi
Published on: 1 July 2022 1:55 PM IST
MP GVL Fire on YCP Government
X

వైసీపీ సర్కార్‌పై ఎంపీ జీవీఎల్ ఫైర్

GVL Narasimha Rao: వైసీపీ సర్కార్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మండిపడ్డారు. జీపీఎఫ్ నుంచి 800 కోట్లు లాగేయటం దారుణమని.. అడిగితే సాంకేతిక లోపం అంటున్నారని విమర్శించారు. గతంలో పంచాయతీ నిధులు లాగేశారని.. అప్పు పుట్టని రోజు ఏదో ఒక అకౌంట్‌లలోకి దూరి లాగేస్తున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యేల అకౌంట్లలో సొమ్ములకు సాంకేతిక లోపం జరగదేం అంటూ ప్రశ్నించారు. వెంటనే GPF సొమ్ము అకౌంట్‌లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలన్నారు.

Jyothi

Jyothi

Next Story