Ambati Rambabu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అంబటి

MP Ambati: మొక్కులు చెల్లించుకున్న అంబటి

Dhatripriya
Updated on: 16 May 2023 2:37 PM IST
MP Ambati visited Tirumala
X

MP Ambati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అంబటి

Ambati: తిరుమల శ్రీవారిని నీటి పారుదల శాఖామంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.... శ్రీవారి పాదాల చెంత వెలసిన శ్రీవారి చెల్లెలు గంగమ్మకు సారె సమర్పించామన్నారు. రాష్ట్ర పండుగగా గంగమ్మ జాతరను ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story