కోడలి తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన అత్త
Andhra Pradesh: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం జరిగింది.
కోడలి తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన అత్త
Andhra Pradesh: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం జరిగింది. కోడలి తల నరికి సంచిలో పెట్టుకొని స్టేషన్‌కు వచ్చి లొంగిపోయిందో మహిళ. కొత్తపేట రామాపురానికి చెందిన సుబ్బమ్మ తన కోడలు వసుంధర తల నరికి పోలీసుల ముందు లొంగిపోయింది. కుటుంబ కలహాలతో పాటు ఆస్తి గొడవలే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




