Chandrababu Arrest: చంద్రబాబుకు సంఘీభావంగా ‘మోత మోగింది’

Chandrababu Arrest: ఏపీ వ్యాప్తంగా మోత మోగిద్దాం కార్యక్రమం చేపట్టింది టీడీపీ.

Arun Chilukuri
Published on: 30 Sept 2023 7:32 PM IST
Motha Mogiddam In Support of Chandrababu
X

Chandrababu Arrest: చంద్రబాబుకు సంఘీభావంగా ‘మోత మోగింది’

Chandrababu Arrest: ఏపీ వ్యాప్తంగా మోత మోగిద్దాం కార్యక్రమం చేపట్టింది టీడీపీ. రాత్రి 7గంటల నుంచి 5నిమిషాల పాటు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. గిన్నెలు మోగిస్తూ, విజిల్స్ వేస్తూ ఏదో ఒక రూపంలో సౌండ్ చేసి మోత మోగించాలని టీడీపీ పిలుపునిచ్చింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. జగన్‌కు వినపడేలా నిరసన గళం వినిపిస్తున్నారు. లోకేష్, బ్రహ్మణి పిలుపుతో.. ఏపీ వ్యాప్తంగా మోత మోగిద్దాం కార్యక్రమంలో టీడీపీ నేతలు, కేడర్ పాల్గొన్నారు. అటు ఢిల్లీ నుంచే మోత మోగిద్దాంలో పాల్గొన్నారు లోకేష్. రాజమహేంద్రవరంలో నారా బ్రాహ్మణి, చిన రాజప్ప తదితరులు విజిల్‌ వేసి, డప్పు కొట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నక్కా ఆనందబాబు తదితరులు మోతమోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story