వైసీపీ ఎంపీకి తృటిలో తప్పిన ప్రమాదం

X
Highlights
Mopidevi Venkata Ramana escaped from accident: మాజీ మంత్రి, వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణకి తృటిలో...
Arun Chilukuri21 Aug 2020 8:41 AM GMT
Mopidevi Venkata Ramana escaped from accident: మాజీ మంత్రి, వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణకి తృటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వేరు వేరు వాహనాల్లో కాన్వాయ్ గా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణలు వస్తున్నారు. అయితే తాళ్లపాలెం జంక్షన్ వద్ద స్టాప్ బోర్డులు అడ్డంగా రావడంతో మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్ లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అయితే కారు దెబ్బతినడంతో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కారులో మోపిదేవి వెళ్ళిపోయినట్టు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు అయినట్ట్టు సమాచారం లేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Web TitleMopidevi Venkata Ramana escaped from the accident
Next Story