Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా.. గుర్తింపు రద్దుకు సిఫార్సు!

Mohan Babu University: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యాకమిషన్ భారీ షాకిచ్చింది.

Arun Chilukuri
Published on: 8 Oct 2025 11:19 AM IST
Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా.. గుర్తింపు రద్దుకు సిఫార్సు!
X

Mohan Babu University: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యాకమిషన్ భారీ షాకిచ్చింది. మోహన్‌బాబు యూనివర్సిటికి భారీ జరిమానా విధించింది. దీనితో పాటు వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. మూడేళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి 26 కోట్ల అదనంగా వసూలు చేశారని ఆరోపణల నేపథ్యంలో ఉన్నతవిద్యా కమిషన్ విచారణ చేపట్టింది.

విచారణ అనంతరం విద్యార్థుల నుంచి నిర్ధేశిత ఫీజుల కంటే... అధికంగా వసూలు చేసినందుకు గానూ.. 15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయాలను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story