Mobile Theatre: ఏపీలో తొలి మొబైల్ థియేటర్.. ఆచార్య సినిమాతో ప్రారంభం..

East Godavari - Mobile Theatre: ఢిల్లీకి చెందిన పిక్చర్ డిజిటల్ సంస్థ సహకారంతో మొబైల్ థియేటర్...

Shireesha
Updated on: 17 April 2022 3:49 PM IST
Mobile Theatre in East Godavari District | AP Live News
X

తూర్పుగోదావరి జిల్లాలో మొబైల్ సినిమా థియేటర్.. సుమారు 120 మంది ప్రేక్షకులు...

East Godavari - Mobile Theatre: తూర్పుగోదావరి జిల్లాలో మొబైల్ సినిమా థియేటర్ రూపుదిద్దుకుంటోంది. ఏపీలో తొలి థియేటర్ జిల్లాలోని రాజానగరంలో ఏర్పాటవుతోంది. సుమారు 120 మంది ప్రేక్షకులు సినిమా వీక్షించేలా నిర్వాహకులు ఈ థియేటర్ ను ముస్తాబు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన పిక్చర్ డిజిటల్ సంస్థ ఆధునిక టెక్నాలజీతో పాతతరం టూరింగ్ టాకీస్ ల తరహాలో మోబైల్ సినిమా థియేటర్ ను రాజానగరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేసింది.

ఎయిర్ బెలూన్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న మోబైల్ థియేటర్‌లో ఏసీ వంటి సౌకర్యాన్ని కల్పించారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేస్తున్న థియేటర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రారంభం కావాల్సిన ఉన్నా.. కొన్ని అనుమతులు రావడం ఆలస్యం కావడంతో మెగాస్టార్ ఆచార్య సినిమాతో ప్రారంభం అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం సెటప్ అంతా ఒక ట్రక్ లో సరిపోయేంత ఉంటుందని సమాచారం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఏపీలో మరిన్ని థియేటర్లను ఏర్పాటు చేయాలని పిక్చర్ డిజిటల్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


Shireesha

Shireesha

Next Story