Marri Rajasekhar: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌

Marri Rajasekhar: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌
x
Highlights

గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నేడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరనున్నారు.

గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నేడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు.

గత శాసనసభ సమావేశాల చివరి రోజునే రాజశేఖర్ వైఎస్సార్సీపీకి, అలాగే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదు.

గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, అలాగే వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్గా పనిచేశారు. అయితే, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినితో ఉన్న విభేదాలు, పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించకపోవడం, జగన్ మోహన్ రెడ్డి పదేపదే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం వంటి కారణాల వల్ల ఆయన వైఎస్సార్సీపీని వీడినట్లు తెలుస్తోంది.

మర్రి రాజశేఖర్ రాకతో టీడీపీకి చిలకలూరిపేట ప్రాంతంలో మరింత బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories