Duvvada Srinivas: ఆహుతి మూవీ గుర్తుకు తెస్తా.. అచ్చెన్నను గుడ్డలూడదీసి తంతా..

Duvvada Srinivas: ఆహుతి సినిమాలో హీరో రాజశేఖర్ విలన్ తన్నినట్టుగా తంతా

Rama Rao
Updated on: 30 May 2022 12:53 PM IST
MLC Duvvada Srinivas Fires on AP TDP President Atchannaidu | AP News
X

Duvvada Srinivas: అచ్చెన్నాయుడును టెక్కలిలో గుడ్డలూడదీసి పరిగెత్తించి తంతా

Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును టెక్కలిలో గుడ్డలూడదీసి పరిగెత్తించి తంతానన్నారు. మీసం మెలేసి మరీ హాట్ కామెంట్స్ చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఆహుతి సినిమాలో హీరో రాజశేఖర్ విలన్ తన్నినట్లు పరిగెత్తించి సేమ్ సేమ్ బాదేస్తానన్నారు. మహానాడులో అచ్చెన్న జగన్మోహన్ రెడ్డిని తిట్టించి ఆనందం పొందారని ఎద్దేవా చేశారు.

జగన్మోహన్ రెడ్డి జోలికొస్తే ఎవరిని వదలనన్నారు. అవసరమైతే ఆత్మాహుతికి సిద్ధమన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తలు అంతు తేలుస్తామని అనడం దారుణమన్నారు. అచ్చెన్నాయుడు రాజకీయ పతనమే జీవిత లక్ష్యమంటూ బహిరంగ విమర్శలు గుప్పించారు దువ్వాడ.

Rama Rao

Rama Rao

Next Story