ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి

ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి
x
Highlights

కరోనా రక్కసి మరో ప్రజానాయకుడిని బలితీసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయారు. గత నెల 13న...

కరోనా రక్కసి మరో ప్రజానాయకుడిని బలితీసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయారు. గత నెల 13న కరోనాతో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆరు నెలల క్రితమే చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చల్లా రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చల్లా మృతిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లా అవుకు మండలానికి చెందిన చల్లా రామకృష్ణా రెడ్డి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత టీడీపీ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు. 1983లో చల్లా రామకృష్ణారెడ్డి తొలిసారిగా పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989, 1991, 1994లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2009లో మళ్లీ ఓటమి చవిచూశారు.

2014 ఎన్నికల్లో చల్లా రామకృష్ణారెడ్డికి ప్రధాన పార్టీల నుంచి టికెట్‌ దక్కలేదు. దీంతో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీకి, తన పదవికి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు. ఎన్నికల అనంతరం వైసీపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories