ఎమ్మెల్సీ అనంతబాబు ఫొటో వివాదం

Anantha Babu : *ఇందుకూరుపేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో..

Sriveni Erugu
Published on: 14 Jun 2022 11:58 AM IST
MLC Anantha Babu Photo Controversy
X

ఎమ్మెల్సీ అనంతబాబు ఫొటో వివాదం

Anantha Babu: ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ అనంతబాబు ఫోటో ఉండటంపై వివాదం నెలకొంది. అల్లూరి జిల్లా ఇందుకూరుపేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ అనంతబాబు ఫోటో వేయించారు అధికారులు. అనంతబాబు ఫ్లెక్సీకి వైసీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేసి ఊరేగించారు. ఇటీవల వైసీపీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు జైలులో ఉన్నాడు. ఆయన ఫోటోను ఫ్లెక్సీలో వేయడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఉన్న నిందితుడు ఫోటోను ఫ్లెక్సీలో ఎలా వేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story