పదవి నుంచి తప్పుకుంటున్నా.. వైవీ సుబ్బారెడ్డికి రాజీనామా లేఖ పంపిన ఎమ్మెల్యే వాసుప‌ల్లి

Vasupalli Ganesh: 2019 ఎన్నికల్లో విశాఖ ద‌క్షిణ అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేశ్ కుమార్‌ కొంత‌కాలం క్రితం వైసీపీకి చేరువ అయిన సంగ‌తి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 4 Jun 2022 5:46 PM IST
MLA Vasupalli Ganesh Resigns to Constituency Coordinator Post
X

పదవి నుంచి తప్పుకుంటున్నా.. వైవీ సుబ్బారెడ్డికి రాజీనామా లేఖ పంపిన ఎమ్మెల్యే వాసుప‌ల్లి

Vasupalli Ganesh: 2019 ఎన్నికల్లో విశాఖ ద‌క్షిణ అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేశ్ కుమార్‌ కొంత‌కాలం క్రితం వైసీపీకి చేరువ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వాసుప‌ల్లి గ‌ణేశ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌దవికి రాజీనామా చేస్తున్నట్లు శ‌నివారం వాసుప‌ల్లి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తరాంద్ర జిల్లాల సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డికి, నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్‌కు లేఖ రాశారు. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం తన గౌరవానికి భంగం కలిగించిందని, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story