జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా: రోజా

జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా: రోజా
x
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు నగిరి ఎమ్మెల్యే రోజా .. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాని అన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు నగిరి ఎమ్మెల్యే రోజా .. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాని అన్నారు. మహిళల కోసం దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారని అన్నారు రోజా.. మహిళల రక్షణ దిశగా ఏపీ సర్కారు మరో అడుగు వేస్తూ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ఈ రోజు ఏపీ రాష్ట్ర సీఎం జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు అర్బన్ జిల్లాలతో కలిపి మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మహిళల కోసం దిశ యాప్‌ను సిద్ధం చేశారు. దీనిని సీఎం జగన్ లాంఛ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజా ట్విట్టర్ లో స్పందిస్తూ.. " మహిళలకు రక్షణగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దిశా యాక్ట్, దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు తెచ్చిన సీయం వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని, చారిత్రాత్మక కార్యక్రమంలో జగనన్న, నా తోటి మహిళా నాయకులతో" అంటూ ట్విట్టర్ లొ పోస్ట్ చేశారు రోజా.. ఈ కార్యక్రమంలో రోజాతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories