logo
ఆంధ్రప్రదేశ్

జనసేనానిపై రోజా ఫైర్

జనసేనానిపై రోజా ఫైర్
X
Highlights

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే రోజా. సొంతంగా పార్టీ పెట్టి పక్క పార్టీ వాళ్లకు...

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే రోజా. సొంతంగా పార్టీ పెట్టి పక్క పార్టీ వాళ్లకు ఓట్లేయమని చెప్పే ఏకైక నాయకుడు పవన్‌ అని ఎద్దేవా చేశారు. ఏపీలో జనసేన ఉనికి లేదన్న రోజా.. గ్రేటర్‌లో బీజేపీకి ఓటేయండని చెప్పి పవన్‌ ఎన్నికల నుంచి తప్పుకున్నాడని ఆరోపించారు.

తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ గెలుపు అసంభవమన్నారు రోజా. ఓవైపు గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు తెలపడం ఆ వెంటనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఇలా ఘాటుగా స్పందించారు రోజా. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన జనసేన అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేసుకుంది. ఇక, చివరి క్షణాల్లో బీజేపీ నేతలు ఆయనను కలిసి మద్దతు తెలపాల్సిందిగా కోరడంతో జనసేన పోటీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

Web TitleMLA Roja Sensational Comments on Pawan Kalyan
Next Story