Roja: నగరి నియోజకవర్గంలో గ్రామీణ క్రీడా సంబరాలు

Roja: ఆటలతో బిజీబిజీగా గడుపుతున్న ఎమ్మెల్యే రోజా

Sandeep Eggoju
Published on: 14 Nov 2021 2:55 PM IST
MLA Roja Played Throw Ball in Rural Sports Festival in Nagari Constituency
X

నగరి నియోజకవర్గం లో జరుగుతున్న గ్రామీణ క్రీడా సంబరాలలో వాలీ బాల్ ఆడిన రోజా

Roja: గత పదిహేను రోజులుగా నగరి ఎమ్మెల్యే రోజా ఆటలతో బిజిబిజీగా గడుపుతున్నారు. గ్రామీణ క్రీడా పోటీల పేరుతో మండలాల వారిగా పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను సత్కరించే కార్యక్రమం చేపట్టారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉత్సాహపరచడానికి వారితో కలసి ఆటలాడుతూ గడుపుతున్నారు రోజా. చివరగా నిర్వహించిన త్రోబాల్ పోటీల సందర్భంగానూ ఆమె క్రీడాకారులతో కలసి త్రో బాల్ ఆడారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా స్పూర్తిని పెంచుతాయని అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story