ఎమ్మెల్యే రోజాకు తప్పిన విమాన ప్రమాదం.. వీడియో వైరల్..

MLA Roja Narrow Escape From Flight Accident
x

ఎమ్మెల్యే రోజాకు తప్పిన విమాన ప్రమాదం.. వీడియో వైరల్..

Highlights

MLA Roja: నగరి ఎమ్మెల్యే రోజాకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండైంది.

MLA Roja: నగరి ఎమ్మెల్యే రోజాకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండైంది. ప్రస్తుతం విమానం బెంగళూరులో సురక్షితంగా దిగినట్లు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి. రోజా ఎక్కిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఈ రోజు ఉదయం10:55 గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఫ్లైట్‎లో సాంకేతిక లోపం తలెత్తింది. గమనించిన పైలట్ చాకచాక్యంగా వ్యవహరించి విమానాన్ని బెంగళూరు వైపు తీసుకెళ్లారు. ఆ సమయంలో విమానంలోని 70 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

సాంకేతికలోపాన్ని సరిదిద్దేందుకు కావాల్సిన మెకానిజం రేణిగుంటలో లేనందునే బెంగళూరు తరలించారని వెల్లడించాయి. సమస్యను పరిష్కరించిన తర్వాత విమానం రేణిగుంట చేరుకోనున్నట్లు తెలిపాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకా విమానంలోనే ఉన్నాం. విమానం డోర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. పైలట్‌కు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అని రోజా ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories