నివర్ తుపానుపై సీఎం జగన్‌ సకాలంలో స్పందించారు: ఎమ్మెల్యే రోజా

నివర్ తుపానుపై సీఎం జగన్‌ సకాలంలో స్పందించారు: ఎమ్మెల్యే రోజా
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రచారాలకే ముందుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఎన్నో...

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రచారాలకే ముందుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఎన్నో విపత్తులు జరిగినా ఏ ఒక్క విపత్తు నిథినీ విడుదల చేయలేదని ఆరోపించారు. నివర్ తుపానుపై సీఎం జగన్ సకాలంలో స్పందించడంతోనే పెను ప్రమాదం నుంచి రాష్ట్ర ప్రజలు బయటపడ్డారన్నారు. మరో రెండు తుఫాన్‌లు పొంచి ఉన్నాయని చెప్పారు. ఏరియల్ సర్వే ద్వారా నివర్ నష్టాన్ని సీఎం అంచనా వేశారని, త్వరలోనే పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వరద సాయం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని రోజా వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories