గుళ్లను కూల్చి బాత్రూమ్స్‌ను కట్టిన వ్యక్తి చంద్రబాబు: రోజా

గుళ్లను కూల్చి బాత్రూమ్స్‌ను కట్టిన వ్యక్తి చంద్రబాబు: రోజా
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ నేతలపై APIIC ఛైర్‌పర్సన్‌ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. hmtvతో ప్రత్యేకంగా మాట్లాడిన రోజా రాజకీయ లబ్ధి కోసమే...

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ నేతలపై APIIC ఛైర్‌పర్సన్‌ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. hmtvతో ప్రత్యేకంగా మాట్లాడిన రోజా రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో వంద గుళ్లను కూల్చినప్పుడు బీజేపీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే గుళ్లను కూల్చారనే సంగతి కాషాయ పార్టీ నేతలకు తెలియదా అంటూ నిలదీశారు.

తిరుపతి ఉపఎన్నిక కోసమే ఈ నీచ రాజకీయాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. గుళ్లను కూల్చి బాత్రూమ్స్‌ కట్టించిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైరయ్యారు. అన్ని మతాలను, కులాలను గౌరవించే వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు కూల్చిన ఆలయాలను సైతం సీఎం జగన్ పునర్ నిర్మిస్తుంటే టీడీపీ, బీజేపీ కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే చంద్రబాబు పతనం ఖాయమన్నారు APIIC ఛైర్‌పర్సన్‌ రోజా.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories