MLA Roja: ఇప్పుడు బాబుకి తగిన శాస్తి తగిలింది.. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా..

MLA Roja: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు.

Arun Chilukuri
Updated on: 19 Nov 2021 5:22 PM IST
MLA Roja Comments on Chandrababu Over Assembly Issue
X

MLA Roja: ఇప్పుడు బాబుకి తగిన శాస్తి తగిలింది.. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా.. 

MLA Roja: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో తనను ఘోరంగా అవమానించారని ఇప్పుడు ఆ పాపం పండిందని ఎద్దెవా చేశారు. తనతో పాటు ఎందరో మహిళలను అవమానించిన చంద్రబాబుకు ఇప్పుడు తగిన శాస్తి తగిలిందన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా తనను సంవత్సరం పాటు సంస్పెడ్‌ చేసిన చంద్రబాబుకు ఇప్పుడు రూల్స్‌గుర్తుగువస్తున్నాయా అని రోజా మండిపడ్డారు.

ఈ రోజు దొంగ ఏడుపులు ఏడ్చే చంద్రబాబును ఎవ్వరూ పట్టించుకోట్లేదని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నీ కోసం 10 సంవత్సరాలు పని చేసిన లీడర్‌గా చూడకుండా.. మహిళ అని చూడకుండా నన్ను మానసిక క్షోభకు గురిచేసిన నువ్వు.. నీకు నువ్వే సరైన శిక్ష వేసుకున్నావు అని అన్నారు. రెండున్నరేళ్లు కాదు కదా మళ్లీ జీవితంలో అసెంబ్లీకి రాలేవన్నారు. బైబై బాబు.. బైబై అంటూ రోజా సంతోషం వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story