Top
logo

Andhra Pradesh: సీఎం జగన్‌కు ఎమ్మెల్యే రోజా కృతజ్ఞతలు

MLA RK Roja Thanked YS Jagan
X

Andhra Pradesh: సీఎం జగన్‌కు ఎమ్మెల్యే రోజా కృతజ్ఞతలు

Highlights

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎమ్మెల్యే రోజా కృతజ్ఞతలు తెలిపారు.

Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎమ్మెల్యే రోజా కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యం పాలైన తనకు ఫోన్ చేసి పరామర్శించిన సీఎం జగన్‌కు, తనకోసం ప్రత్యేక పూజలు చేసిన పార్టీ నాయకులు, అభిమానులకు ధన్యావాదాలు తెలిపారు. రెండు మేజర్ సర్జరీలు జరిగిన కారణంగా మరో నెలరోజుల వరకూ నడవలేను కాబట్టే పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు.

అయితే ప్రతి ఒక్కరూ వైసీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగనన్న పాలనకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ఏవిధంగా జగనన్నకు కానుక ఇచ్చారో, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ అదే విధంగా వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు మరింత ఘనమైన కానుక ఇవ్వాలని రోజా సూచించారు.


Web TitleMLA RK Roja Thanked CM YS Jagan
Next Story