Mekathoti Sucharita: మంత్రి పదవి రాకపోవడం బాధగా లేదు

Mekathoti Sucharita: వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా

Rama Rao
Updated on: 11 April 2022 5:30 PM IST
MLA Mekathoti Sucharita Remarks on AP Cabinet | TS News Today
X

Mekathoti Sucharita: మంత్రి పదవి రాకపోవడం బాధగా లేదు

Mekathoti Sucharita: మంత్రి పదవి రాకపోవడం బాధగా లేదన్నారు ఎమ్మెల్యే సుచరిత. కానీ కొన్ని కారణాలు బాధించాయన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్న సుచరిత రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌ వెంటే ఉంటానన్నారు. పదవుల కోసం వెంపర్లాడే వాళ్లం కాదని 2009లో అసెంబ్లీలో వైఎస్‌ కుటుంబం కోసం తల వంచుకొని నిలబడి, రాజీనామా చేసేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేశారు మేకతోటి సుచరిత.

బెదిరించారు, ఆశ చూపారు. కానీ వైఎస్ ఫ్యామిలీ తమకు ముఖ్యమన్నారు. అడుగులకు మడుగులు ఒత్తితే మంత్రివర్గంలో కొనసాగేవాళ్లమని పార్టీ పెట్టేటప్పుడు లేని వారు. ఇప్పుడు పార్టీ అధికారాన్ని అనుభవిస్తూ పార్టీ నడిపే స్థాయిలో ఉన్నారని విమర్శించారు. ఆత్మాభిమానం కోసం బ్రతికేవారిని అవమానిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయని అధిష్టానం తెలుసుకోవాలన్నారు సుచరిత.

Rama Rao

Rama Rao

Next Story