Gudivada Amarnath: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విశాఖ నుంచే పరిపాలన

*ఏపీ క్యాపిటల్‌ వైజాగ్‌గా డాక్యుమెంట్‌లో పొందుపరిచిన కేంద్రం *సీఎం జగన్‌ నిర్ణయానికి తిరుగులేదు- గుడివాడ అమర్నాథ్

Sandeep Reddy
Updated on: 30 Aug 2021 8:02 AM IST
MLA Gudivada Amarnath Says Administration From Visakhapatnam From Next Financial Year
X

గుడివాడ అమర్నాథ్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Gudivada Amarnath: ఏపీలో మూడు రాజధానులపై ముందడుగు పడింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలపై ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు, కేంద్రం సమాధానం చెబుతూ, ఏపీ క్యాపిటల్ వైజాగ్ గా పార్లమెంట్ విడుదల చేసిన డాక్యుమెంట్ లో పొందుపరిచారు. మూడు రాజధానులపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి ఇదే సమాధానమని, సీఎం జగన్ నిర్ణయానికి తిరుగులేదని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడిన వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విశాఖ నుండే పరిపాలన ప్రారంభించే అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story