వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌
x
Highlights

MLA Bhumana Karunakar Reddy tests positive for coronavirus: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతుంది. నగరాలు, పట్టాణాలు దాటుకుని గ్రామాలకు కూడా...

MLA Bhumana Karunakar Reddy tests positive for coronavirus: ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతుంది. నగరాలు, పట్టాణాలు దాటుకుని గ్రామాలకు కూడా పాకింది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధుల్ని ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ తేలింది. తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డితో పాటూ ఆయ‌న కుమారుడు అభిన‌య్ రెడ్డికి కూడా వైరస్ నిర్థారణ అయ్యింది. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు.

కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు. కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. తనను కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవాలని, ల‌క్ష‌ణాలున్న‌వారు హోమ్ ఐసోలేష‌న్‌లోనే ఉండాల‌ని ఆయ‌న‌ సూచన‌లు చేశారు. అలాగే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories