టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే ఫైర్..

MLA Anna Rambabu Fires on TTD EO AV Dharma Reddy
x

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే ఫైర్..

Highlights

Anna Rambabu: శాసన సభ్యుడికి కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.

Anna Rambabu: శాసన సభ్యుడికి కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒంటెత్తి పోకడలకు వెళ్తున్నారని ఫైరయ్యారు. టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీస్ అంటే కూడా ఈవోకి లెక్క లేకుండా పోతుందన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తానన్నారు. తిరుమలలో భక్తుల అందరికీ ఒకే నిబంధన అమలు చేస్తే, తాము కూడా సామాన్య భక్తుడిలా స్వామి వారిని దర్శనం చేసుకుంటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories