అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ ధరించిన వివాదంపై స్పందించిన మాజీ మంత్రి అనిల్

MLA Anil Kumar Yadav Reacted on BJP Allegations Over his Ayyappa Mala Allegations
x

అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ ధరించిన వివాదంపై స్పందించిన మాజీ మంత్రి అనిల్

Highlights

Anil Kumar Yadav: అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ ధరించారన్న వివాదంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

Anil Kumar Yadav: అయ్యప్ప దీక్షలో ముస్లిం టోపీ ధరించారన్న వివాదంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. హిందూ ముస్లింలను వేరు చేసే విధంగా బీజేపీ నేతల వ్యాఖ్యలు సరైనవి కావని మండిపడ్డారు. ప్రతి అయ్యప్ప మాలదారుడు మొదట వావర్ స్వామి మసీదు దర్శించుకునే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారన్న విషయం కూడా తెలీదా అని ప్రశ్నించారు. హిందూ మతం ఆచారాలు తెలిసీ కూడా బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. తాను చేసింది తప్పో.. కాదో ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ సీనియర్ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories