MLA Anam: నా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి.. నన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారు..

MLA Anam: నా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి.. నన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారు..

Arun Chilukuri
Updated on: 31 Jan 2023 6:01 PM IST
MLA Anam Ramanarayana Reddy Alleged That his Phone was Tapped
X

MLA Anam: నా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి.. నన్ను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారు..

Anam Ramanarayana Reddy: గన్‌మెన్లను తొలగించడంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. నా ఫోన్లు ట్యాంపింగ్ అవుతున్నాయని అన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా వాట్సాప్ కాల్స్ చేయాల్సి వస్తోందని ఆయన వాపోయారు. తమ పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తుంటే తాను ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి ఉందని... రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు ఆనం. భద్రత తొలగింపుపై ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story