రాష్ట్రంలో ప్రజాబలం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే : అంబటి

రాష్ట్రంలో ప్రజాబలం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే : అంబటి
x
Highlights

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తీరు వివాదాస్పదంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం పార్టీల అభిప్రాయం తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు.

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తీరు వివాదాస్పదంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం పార్టీల అభిప్రాయం తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికలను వాయిదా వేసినప్పుడు ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపిస్తోందన్న అంబటి.. ఒక పార్టీకి ఎస్‌ఈసీని తాకట్టు పెట్టేలా వ్యవహరించొద్దని సూచించారు. ఇక రాష్ట్రంలో ప్రజాబలం ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అని అన్నారు. తాము ఎన్నికలకి భయపడమని ఈ సందర్భంగా అయన వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ మొదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో మాత్రమే ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories