రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
x
Highlights

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో రైలు ఇంజిన్‌ చక్రాల నుంచి మంటలు చెలరేగాయి. దాంతో లోకో పైలెట్...

రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో రైలు ఇంజిన్‌ చక్రాల నుంచి మంటలు చెలరేగాయి. దాంతో లోకో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి రైలును నిలిపివేశారు. వెంటనే కొందరు ప్రయాణికుల రైలు దిగి బోగీలకు నీళ్లు చల్లారు. ఆ తరువాత సిబ్బంది కూడా నీళ్లు చల్లడంతో కాసేపటికి మంటలు ఆగిపోయాయి. పెను ప్రమాదం నుంచి హప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామంతో సుమారు మూడు గంటల పాటు తాడిపత్రిలోనే రైలును నిలిపివేశారు అధికారులు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని..

బంధువులు ఆందోళన చెందాల్సింది లేదని స్పష్టం చేశారు. కాగా రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం పేరు పెట్టారు. అది మార్గమధ్యంలో రాయలసీమ లోని (చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు) అన్ని నాలుగు జిల్లాల ద్వారా ప్రయాణిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు, నిజామాబాదు ను అలాగే ప్రఖ్యాత హిందూ మత పుణ్యక్షేత్రం తిరుపతి నగరాలను కలుపుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories