చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన గణేష్ ఆచూకీ లభ్యం

చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన గణేష్ ఆచూకీ లభ్యం
x

చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన గణేష్ ఆచూకీ లభ్యం

Highlights

* దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ లేఖ * లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన గణేష్ * గణేష్ కోసం వారం రోజులపాటు గాలింపు

చిత్తూరు జిల్లా గంగవరం మండలం మార్జేపల్లికి చెందిన గణేష్ ఆచూకి దొరికింది. గణేష్ అదృశ్యంపై హెచ్ఎంటీవీ వరసగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన గణేష్.. తాను క్షేమంగా ఉన్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 21న చిత్తూరు జిల్లా మార్జేపల్లికి చెందిన గణేష్ దేవుడి దగ్గరకు వెళ్తున్నానని లేఖ రాసి, ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గణేష్ అదృశ్యంపై హెచ్ఎంటీవీ వరుస కథనాలను ప్రాసరం చేసింది. దీంతో తాను వైజాగ్‌లో క్షేమంగా ఉన్నట్టు తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వారి బంధువులు రాత్రికి రాత్రే.. వైజాగ్‌ ఉన్న గణేష్ దగ్గరకు వెళ్లారు. తన కొడుకు గురించి కథనాలు ప్రసారం చేయడంతో హెచ్ఎంటీవీకి వారు ధన్యవాదాలు తెలిపారు గణేష్ తల్లిదండ్రులు.


Show Full Article
Print Article
Next Story
More Stories