వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసు

వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసు
x
వైసీపీ ఎమ్మెల్యేలపై మిస్సింగ్ కేసు
Highlights

రాజధాని అమరావతిలో మరో ఎమ్మెల్యేపై స్ధానికులు ఫిర్యాదు చేశారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదంటూ పోలీసులకు పిర్యాదుచేశారు. తుళ్లూరు...

రాజధాని అమరావతిలో మరో ఎమ్మెల్యేపై స్ధానికులు ఫిర్యాదు చేశారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించడం లేదంటూ పోలీసులకు పిర్యాదుచేశారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్న రాజధాని రైతులు తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణపైన ఫిర్యాదు చేసిన స్ధానికులు ఈ రోజు శ్రీదేవిపై ఫిర్యాదు చేశారు .

రాజధాని గ్రామాల్లో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాజధాని అంశంపై న్యాయవాదుల నిరసనకు దిగారు. తుళ్లూరు నుంచి హైకోర్టు వరకు ర్యాలీ చేపట్టారు. హైకోర్టుకు చేరుకుని అక్కడ న్యాయవాదులు నిరసన తెలపనున్నారు. ఇటు తుళ్లూరులో రైతుల తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ గోడు వినిపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories