Tirupati: తిరుపతి జిల్లాలో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై పనులు చేస్తున్న కూలీలు

Tirupati: సడన్ బ్రేక్ వేసి రైలును ఆపిన డ్రైవర్

Shekhar G
Published on: 25 Aug 2023 5:56 PM IST
Missed Train Accident In Tirupati District
X

Tirupati: తిరుపతి జిల్లాలో తప్పిన రైలు ప్రమాదం.. పట్టాలపై పనులు చేస్తున్న కూలీలు

Tirupati: తిరుపతి జిల్లా కొండగుంట రైల్వే స్టేషన్ సమీపంలో వివేక్ ఎక్స్ ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ట్రైన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న వివేక్ ఎక్స్ప్రెస్ కొండా కుంట రైల్వే స్టేషన్ కు చేరుకునే క్రమంలో సిగ్నల్ లింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ట్రైన్ వేగంగా దూసుకు వెళ్ళింది. అదే సమయంలో పనులు చేపడుతున్న రైల్వే కూలీలు పరుగులు తీశారు. పనిముట్లు మాత్రం పట్టాలపై వదిలేశారు. ఈ విషయాన్ని గుర్తించిన ట్రైన్ డ్రైవర్ చాకచక్యంగా సడన్ బ్రేక్ వేసి ప్రమాదాన్ని తప్పించారు. పనిముట్లను తొలగించి రైలును యధావిధిగా నడిపారు.

Shekhar G

Shekhar G

Next Story