logo
ఆంధ్రప్రదేశ్

కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో దారుణం.. సీక్రెట్ కెమెరా అమర్చి వీడియో రికార్డ్ చేసిన గంగాధర్

Misconduct In Atreyapuram Of Konaseema District
X

కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో దారుణం.. సీక్రెట్ కెమెరా అమర్చి వీడియో రికార్డ్ చేసిన గంగాధర్

Highlights

* విషయం తెలిసి గంగాధర్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Konaseema: కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని లొల్లలాకుల ఇరిగేషన్ క్వార్టర్స్ లో దారుణం జరిగింది. ఇరిగేషన్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి గంగాధర్ యువతులు దుస్తులు మార్చుకుంటుండగా తన సెల్ ఫొన్ లో రికార్డు చేశాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది. కార్తీక వనభోజనాల వేడుకలకు వచ్చిన అమ్మాయిలకు దుస్తులు మార్చుకునేందుకు ఇరిగేషన్ క్వార్టర్స్ లో రూమ్ ఇచ్చారు. అయితే ప్లాన్ ప్రకారం ముందుగానే రూమ్ లో సెల్ ఫోన్ అమర్చి యువతులు దుస్తులు మార్చడాన్ని రికార్డ్ చేశాడు కీచక ఉద్యోగి. అయితే రూమ్ లో ఫోన్ కనిపించడంతో షాక్ కు గురయ్యారు యువతులు. స్థానికులకు చెప్పడంతో ఇరిగిషన్ ఒప్పంద ఉద్యోగి గంగాధర్ కు దేహశుద్ధి చేశారు. అనంతరం ఆత్రేయపురం పోలీసులకు సెల్ ఫోన్ తో పాటు ఇరిగేషన్ శాఖ ఉద్యోగిని అప్పగించారు.

Web TitleMisconduct In Atreyapuram Of Konaseema District
Next Story