క్లాస్ రూమ్‌లోనే పెళ్లి చేసుకున్న మైనర్లు : టీసీ ఇచ్చి పంపించేసిన ప్రిన్సిపల్

క్లాస్ రూమ్‌లోనే పెళ్లి చేసుకున్న మైనర్లు : టీసీ ఇచ్చి పంపించేసిన ప్రిన్సిపల్
x
Highlights

కాలేజీలో కలిశారు. ఆపై ప్రేమించుకున్నారు. కళాశాలను కళ్యాణ మండపంగా మార్చుకున్నారు. క్లాస్ రూమ్ లోని బెంచీలను పెళ్లిపీటలుగా చేసుకున్నారు. పసుపుకొమ్ముతో...

కాలేజీలో కలిశారు. ఆపై ప్రేమించుకున్నారు. కళాశాలను కళ్యాణ మండపంగా మార్చుకున్నారు. క్లాస్ రూమ్ లోని బెంచీలను పెళ్లిపీటలుగా చేసుకున్నారు. పసుపుకొమ్ముతో చేసిన తాళిని యువతి మెడలో కట్టాడు.

రాజమండ్రిలోని ఓ జూనియర్‌ కాలేజీలో ఈ మైనర్ల పెళ్లి జరిగింది. ఇంటర్‌ చదువుతున్న టీనేజర్లు ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారో లేదోనన్న భయంతో కాలేజీలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ వారికి టీసీ ఇచ్చి పంపించి చేతులు దులుపుకున్నారు.

విద్యార్థులు చేసిన పనితో వారి తల్లిదండ్రులు తలపట్టుకుంటున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో ఈ పిచ్చి పనులేంటంటూ ఆవేదన చెందుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే పెళ్లిని ఎగతాలి చేస్తూ ఇలా బొమ్మల పెళ్లిళ్లు చేసుకోవడమేంటంటూ మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories