Vidadala Rajini: లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి విడదల రజనీ..

Minister Vidadala Rajini Stuck In The Lift
x

Vidadala Rajini: లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి విడదల రజనీ..

Highlights

Vidadala Rajini: విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి విడదల రజనీ.. కొన్ని సెకన్ల పాటు ఓ లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు.

Vidadala Rajini: విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి విడదల రజనీ.. కొన్ని సెకన్ల పాటు ఓ లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు. జర్నలిస్ట్‌లకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్లారు. అయితే కార్యక్రమం ముగించుకొని లిఫ్ట్‌లో కిందకు దిగుతుండగా ఓవర్‌లోడ్‌తో పాటు అదే సమయంలో కరెంట్‌ పోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది.. ఎమర్జెన్సీ కీ సాయంతో లిఫ్ట్‌ను కిందకు దించడంతో మంత్రి సురక్షితంగా బయటకు వచ్చారు. మంత్రి విడదల రజనీతో పాటు లిఫ్ట్‌లో జిల్లా కలెక్టర్, డాక్టర్ మల్లికార్జున్ ఇతర అధికారులు కూడా ఉన్నారు. అయితే ఎలాంటి ఇబ్బంది కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories