జగన్ దెబ్బకు చంద్రబాబు కుప్పం పరిగెత్తారు: మంత్రి వెల్లంపల్లి

Arun Chilukuri
Published on: 27 Feb 2021 3:08 PM IST
జగన్ దెబ్బకు చంద్రబాబు కుప్పం పరిగెత్తారు: మంత్రి వెల్లంపల్లి
X

image(the hans india)

టీడీపీ అధినేత చంద్రబాబు ఓ జోకర్ అంటూ మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పంచాయతీ ఎన్నికల్లో జగన్ దెబ్బకు కుప్పం పరిగెత్తారని ఎద్దేవా చేశారు. కుప్పంలో ప్రజలు జూనియర్ ఎన్టీఆర్‌ను తెమ్మంటున్నారు కానీ లోకేష్ కాదన్న మంత్రి.. ప్రజలకు టీడీపీపై నమ్మకం పోయిందన్నారు. చంద్రబాబు పాపాల్లో పవన్‌కు పాత్ర లేదా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు ఇంకా తానే ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారని మంత్రి వెల్లంపల్లి ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story