విగ్రహాల ధ్వంసంపై ఏపీ ప్రభుత్వం చర్యలు

విగ్రహాల ధ్వంసంపై ఏపీ ప్రభుత్వం చర్యలు
x
Highlights

ఆలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేవాదాయ, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ...

ఆలయాలపై వరుస దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేవాదాయ, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ భద్రతపై చర్చిస్తున్నారు. దేవాలయాల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నారు. అలాగే, దేవాదాయ-పోలీస్ శాఖల సమన్వయంతో ప్రతి ఆలయం దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణపై మరోసారి డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. రామతీర్ధం ఆలయంలో జరిగిన ఘటన దురదృష్డకరమని, దీని వెనుక కుట్రకోణాలు కనిపిస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories