మంత్రి వెల్లంపల్లి అత్యవసర భేటీ

X
Highlights
ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. ఏపీలో...
Arun Chilukuri2 Jan 2021 10:34 AM GMT
ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. ఏపీలో జరుగుతున్న దేవాలయపై దాడుల ఘటనలతో దేవాదాయశాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విజయనగరం ఘటనతో దేవదాయశాఖ అలెర్ట్ అయింది. ఉన్నతాధికారలతో చర్చించిన తర్వాత మంత్రి వెల్లంపల్లి వివరణ ఇచ్చే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో దేవాలయాలపై జరిగిన ఘటనల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మొన్న రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిన్న 2021 మొదలైన తొలిరోజే రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహానికి చేతులు తొలగించి వేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Web Titleminister Vellampalli Srinivas emergency meeting with Endowments Department
Next Story