వకిల్ సాబ్‌ సినిమాల్లోనే.. బయట పకీర్ సాబ్

Samba Siva Rao
Published on: 29 Dec 2020 7:18 PM IST
వకిల్ సాబ్‌ సినిమాల్లోనే.. బయట పకీర్ సాబ్
X

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. పవన్‌ పర్యటన సినిమా ప్రమోషన్‌లా ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ సినిమాల్లోనే వకిల్ సాబ్‌..బయట మాత్రం పకీర్ సాబ్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం తూర్పు నియోజకవర్గంలోని ఏ వన్ కన్వెన్షన్‌లో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, పేదలకు అండగా ఉన్నారని ప్రశంసించారు. చంద్రబాబు అండ్ కో ఇళ్ల పట్టాల పంపిణీకి పదేపదే అడుపడ్డారని, కోర్టులకు వెళ్లారని అయినప్పటికీ వాటిని సీఎం జగన్ ఛేదించి ప్రజలకు ఇళ్ల పట్టాలను అందించారని తెలిపారు.

మరోవైపు నారా లోకేశ్ పై కూడా మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. నారా లోకేష్‌కు జయంతి, వర్ధంతికి తేడా తెలిదని, లోకేశ్ కు సీఎం విమర్శించే స్థాయి లేదని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ హయాంలో పేదలు ఎంత సంతోషంగా ఉన్నారో.. ఆయన తనయుడు జగన్ పాలనలో కూడా రెట్టింపు సంతోషంగా ఉన్నారని మంత్రి వెల్లంపల్లి అన్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story