Vangalapudi Anitha: ఏపీలో వర్షాలపై మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష

Vangalapudi Anitha: ఏపీలో వర్షాలపై మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 July 2024 10:01 PM IST
Minister Vangalapudi Anitha review on rains in AP with officials
X

Vangalapudi Anitha: ఏపీలో వర్షాలపై మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష 

Vangalapudi Anitha: ఏపీలో వర్షాలపై మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్ లో మాట్లాడారు. ఆయా జిల్లాలో వర్షాల ప్రభావం, తాజా పరిస్థితి, నష్ట నివారణ చర్యలపై ఆరా తీశారు. అల్లూరి జిల్లాలో ఏడు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అల్లూరి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు వరద ప్రాంతాల్లో NDRF బలగాలను రంగంలోకి దింపారు. ఆహారం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి. చింతూరు ఏజెన్సీలో వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్బిణీ స్త్రీలు, రోగులను సమీప PHCలకు తరలించాలని కోరారు మంత్రి వంగలపూడి అనిత.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story