చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి అప్పలరాజు

Arun Chilukuri
Published on: 5 Jan 2021 5:06 PM IST
చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి అప్పలరాజు
X

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయన్నారు ఆయన. ఇప్పటిదాకా.. వ్యక్తుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు తాజాగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని తండ్రీకొడుకులు‌ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు.. ఎన్టీఆర్‌ కన్నా గొప్ప నటుడన్న మంత్రి, లోకేష్‌ శవయాత్రలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రామతీర్థ ఘటనపై కావాలంటే సీబీఐ విచారణ కోరతామన్నారు మంత్రి సిదిరి అప్పలరాజు. టీడీపీ నాయకులు ఆకృత్యాలకు పాల్పడితే అరెస్టు చేస్తే తప్పు అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రామతీర్థ ఘటనలో సూరిబాబు అనే వ్యక్తి పాత్రను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story