జేసీ ఆకృత్యాలు తాడిపత్రి ప్రజలందరికీ తెలుసు: మంత్రి శంకర్ నారాయణ

Arun Chilukuri
Published on: 23 Feb 2021 5:10 PM IST
జేసీ ఆకృత్యాలు తాడిపత్రి ప్రజలందరికీ తెలుసు: మంత్రి శంకర్ నారాయణ
X

జేసీ ఆకృత్యాలు తాడిపత్రి ప్రజలందరికీ తెలుసు: మంత్రి శంకర్ నారాయణ

జేసీ దివాకర్‌రెడ్డి జానీవాకర్‌లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి శంకర్ నారాయణ. దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌ గురించి మాట్లాడడం దారుణం అన్న మంత్రి.. దివాకర్ రెడ్డి కుటుంబం చేస్తున్న ఆకృత్యాలు తాడిపత్రిలో అందరికీ తెలుసని విమర్శించారు. ఆయన ఇదే తీరుతో మాట్లాడితే అనంతపురం ప్రజలు జేసీ నాలుక కోస్తారు అంటూ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఏడాదిన్నరలో రూ.70 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించినట్లు మంత్రి శంకర్‌నారాయణ వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story