Andhra Pradesh: చంద్రబాబునాయుడిపై మళ్లీ విమర్శలు చేసిన మంత్రి సజ్జల

Andhra Pradesh: టీడీపీ మేనిఫెస్టోను తప్పుపట్టిన మంత్రి సజ్జల * ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తామని మంత్రి సజ్జల వెల్లడి

Sandeep Eggoju
Published on: 26 Feb 2021 9:06 PM IST
Minister Sajjala again Criticized Chandrababu Naidu
X

ఫైల్ ఇమేజ్ 

Andhra Pradesh: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిపై మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ ఫైరయ్యారు. కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబుకి మతిస్థిమితం తప్పినట్లుందని ఎద్దెవా చేశారు. బాబు పరిస్థితి టీడీపీ నాయకులకే అర్థమవ్వడం లేదని ఆరోపించారు. చంద్రబాబు మళ్లీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారని మండిపడ్డారు. దీనిపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేస్తామని సజ్జల వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసినా చంద్రబాబుకు ఇంకా బుద్ది రావడం లేదని మంత్రి సజ్జల విమర్శించారు. కడప పర్యటనలో భాగంగా ఆయన జిల్లా నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. మున్సిపల్‌, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వైసీపీ జిల్లా నాయకులకు మంత్రి దిశానిర్ధేశం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story