తహశీల్దార్‌ హత్యను ఖండిస్తున్నాం.. నిందితుడిపై కఠిన చర్యలు..: మంత్రి సబిత

తహశీల్దార్‌ హత్యను ఖండిస్తున్నాం.. నిందితుడిపై కఠిన చర్యలు..:  మంత్రి సబిత
x
Highlights

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డిపై తహశీల్దార్‌ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా...

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డిపై తహశీల్దార్‌ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలే తప్ప అధికారులపై ఇలాంటి చర్యలు చేయడం దారుణమని అన్నారు. ఘటనాస్థలికి చేరుకుని అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. హత్య వెనుక ఎవరున్నారు ఎవరి ప్రోద్భలంతో చేశారనే దానిపై విచారణ జరుపుతామన్నారు. తహసీల్దార్‌ హత్య ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories