Roja: చంద్రబాబు అరెస్టు అయితే మామీద పడి ఎందుకు ఏడుస్తున్నారు

Roja: బండారుపై పరువు నష్టం దావా వేస్తా

Shekhar G
Published on: 3 Oct 2023 6:40 PM IST
Minister Roja Was In Tears Over TDP Leader Bandaru Comments
X

Roja: చంద్రబాబు అరెస్టు అయితే మామీద పడి ఎందుకు ఏడుస్తున్నారు

Roja: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై.. మంత్రి రోజా కంటతడి పెట్టుకున్నారు. బండారు సత్యనారాయణ ఎంతో నీచంగా మాట్లాడారని మీడియా ముందు రోజా కన్నీటి పర్యంతం అయ్యారు. బండారు వ్యాఖ్యలను మేధావులంతా ఖండించాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్టు అయితే మామీద పడి ఎందుకు ఏడుస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే మా క్యారెక్టర్ మీద దాడి చేస్తారా అని ఫైర్ అయ్యారు రోజా. టీడీపీ అంటే.. తెలుగు దుశ్సాసన పార్టీ అని ఆమె ఎద్దేవా చేశారు. బండారుపై పరువు నష్టం దావా వేస్తానని రోజా అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story